Header Banner

సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది..! బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ!

  Thu May 08, 2025 10:23        Others

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రానున్న మూడు రోజులు తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణాలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
దీంతో గురువారం(మే 08) తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. రేపు తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్ష సూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఇవాళ రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రేపు ఉష్ణోగ్రతలు 40°C – 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని, ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #WeatherAlert #RainySeason #TeluguStates #APWeather #TSWeather #HeavyRains #Thunderstorms #SummerToRain